Guppedantha manasu serial today:గుప్పెడంత మనసు సీరియల్ vasudhara పారితోషికం ఎంతో తెలుసా?
Guppedantha Manasu Serial Today Vasudhara :స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతూ, ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ లో నటీనటులు తమ నటనతో, అందంతో అలరిస్తున్నారు. ఇందులో Vasudhara తన నటనతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈమె అసలు పేరు రక్షా గౌడ. 1995ఫిబ్రవరి 17న బెంగుళూరులో జన్మించిన ఈమెకు 25ఏళ్ళు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి స్టాఫ్ నర్సు.
రక్షా గౌడను రక్షా, Vasudhara అని నిక్ నేమ్స్ తో పిలుస్తున్నారు. ఈమెకు ఓ బ్రదర్ ఉన్నాడు. లోకల్ ఇంగ్లీషు గ్రామర్ హైస్కూల్ లో చదివిని అనంతరం జైన్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసింది. స్కూల్ డేస్ నుంచి సినిమాలపై మోజు గల రక్షా తాను చూసిన సినిమాల్లో క్యారెక్టర్ ని ఊహించుకుంటూ ఇంట్లో అద్దం ముంగిట నటించేది. అయితే పేరెంట్స్ సూచన మేరకు స్టడీస్ పై దృష్టి పెట్టింది. డాక్టర్ అవ్వాలనే గోల్ పెట్టుకుంది.
అయితే ఇంటర్ చదువు తున్న సమయంలో కన్నడ సీరియల్స్ లో ఛాన్స్ వచ్చింది. దాంతో సీరియల్ కి ఒకే చెప్పి యాక్టర్ అయింది. రాధారమణ అనే తొలిసిరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది. అలా కన్నడంలో నటిస్తూ,కృష్ణవేణి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నానక్ రామ్ గూడా ఏరియాలో మంచి హౌస్ లో ఉంటున్న రక్షా కు ఓ కారుంది. ట్రావెలింగ్, షాపింగ్, కుకింగ్ ఈమె హాబీస్. కెజిఎఫ్ హీరో యష్ అభిమాన హీరో. ఐశ్వర్యా రాయ్ అంటే ఇష్టం. న్యూజిలాండ్ అంటే ఇష్టమైన ప్రదేశం. ఒక్కొక్క ఎపిసోడ్ కి 17వేలు అందుకుంటోంది. నెట్ వర్త్ 3కోట్లు. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఇక రక్షా ఇంట్లో తయారుచేసిన ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది.