Pomegranate Peel: దానిమ్మ తిని తొక్కలు పాడేస్తున్నారా…ఈ విషయాలు తెలిస్తే అసలు పాడేయరు
Pomegranate Peel in telugu : మనలో చాలా మంది పండ్లను తిని తొక్కలను పాడేస్తూ ఉంటారు. అలా పాడేసే తొక్కలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడి చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది.
ఈ పొడిలో నిమ్మరసం లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. మొటిమలు ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ని రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మూడు రోజుల పాటు ఈ విధంగా చేస్తే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.
రెండు స్పూన్ల పొడిని తీసుకోని దానిలో పెరుగు కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడకు రాసి పది నిముషాలు అయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ తోక్కలలో ఎల్లగిక్ యాసిడ్ ఉండుట వలన చర్మంలో తేమను లాక్ చేస్తుంది. అలాగే చర్మాన్ని సున్నితంగా మరియు మృదువుగా ఉంచుతుంది.
జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో దానిమ్మ తొక్కలపొడి కలిపి జుట్టుకి బాగా పట్టించి రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.