Healthhealth tips in telugu

lizards :ఇలా చేస్తే బల్లులు ఒక్క నిమిషంలో మాయం అయ్యిపోతాయి

How to remove lizards from home : ప్రతి ఇంటిలోనూ బల్లులు ఉండటం సహజమే. వీటితో మనుషులకు పెద్దగా ప్రమాదం లేదు. పైగా ఇంట్లోని కీటకాలను తింటూ మనకే మేలుచేస్తాయి. అయినా మనలో చాలా మందికి బల్లులంటే నచ్చదు. వాటిని చూస్తేనే భయమేస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది.

అలాంటి బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. బల్లులు ఉన్న ప్రదేశంలో కాఫీ పొడి జల్లవచ్చు. లేకపోతే కాఫీ పొడిలో నీటిని కలిపి spray చేయవచ్చు.

ఉల్లిపాయ కూడా బల్లులను తరిమికొట్టటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు పడదు. ఉల్లిరసాన్నిగోడలపై స్ప్రే చేస్తే బల్లులు వెళ్లిపోతాయి. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కిటికీలు, మూలల్లో ఉంచినా సరిపోతుంది.

వెల్లుల్లి వాసన కూడా బల్లులకు నచ్చదు. అందువల్ల బల్లులు ఉన్న ప్రదేశంలో వెల్లుల్లి రెబ్బలను పెట్టవచ్చు. లేదా వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి బాటిల్ లో పోసి spray చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.