Healthhealth tips in telugu

Purple Food Benefits:ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Purple Color Foods benefits : మనకు తినటానికి ఎన్నో రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మన శరీరానికి ఆరోగ్యకరమైనవి ఉంటే… మరికొన్ని మన శరీరానికి అనారోగ్యాలను కలిగించేవి ఉన్నాయి.

ఆరోగ్యకరమైన ఆహారాలలో ఎన్నో రంగుల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పర్పుల్ కలర్ ఆహారాలను తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తినటం వలన శరీరంలో వ్యర్ధాలు అన్నీ తొలగిపోయి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మం యవ్వనంగా ఉంటుంది.

చర్మ సమస్యలు ఏమి ఉండవు. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలను నివారిస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌లో విటమిన్ A సమృద్దిగా ఉంటుంది.

అందువల్ల కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆహారాలలో ఆంథోస‌య‌నిన్స్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు ఉండుట వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.