Rice water for hair: 7 రోజుల్లో జుట్టు రాలే సమస్య తగ్గి పలచగా ఉన్నజుట్టు చాలా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Rice Water and flax seeds Hair fall Tips In telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం, కెమికల్స్ ఎక్కువగా ఉండే నూనెలు, షాంపూలు ఎక్కువగా వాడటం వలన జుట్టు రాలే సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి, జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. ఈ రెమిడీ కోసం ఆవిసే గింజలు, బియ్యంలను ఉపయోగిస్తున్నాం.
ఒక గిన్నెలో 2 స్పూన్ల బియ్యం, 2 స్పూన్ల ఆవిసే గింజలను, గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 7 నుంచి 9 నిమిషాలు మరిగించాలి. అప్పుడే బియ్యం, ఆవిసే గింజలలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి జుట్టుకి పట్టించాలి. గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం, ఆవిసే గింజలలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి. దాంతో జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.