Spinach Sambar:ఘుమఘుమలాడే పాలకూర సాంబార్…రుచి అద్భుతంగా ఉంటుంది
Spinach Sambar Prepare:పాలకూరతో సాధారణంగా మనం కూర, పప్పు, పచ్చడి వంటివి చేసుకుంటాం. అయితే ఈ రోజు పాలకూరతో సాంబార్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మరల మరల చేసుకొని తింటారు.
కావలసిన పదార్ధాలు
1/2 cup కంది పప్పు, 200 gms పాలకూర, 300 ml చింతపండు (పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నుండి తీసినది), 3 పచ్చిమిర్చి, 10 – 12 సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, 1 tsp కారం, 1/2 tsp పసుపు, 2 tbsp సాంబార్ పొడి, 2 tbsp కొత్తిమీర, 1/2 liter నీళ్ళు, 2 tsp నూనె, 1/2 tsp మెంతులు, 1/2 tsp ఆవాలు, 1/4 tsp ఇంగువ, 3 ఎండు మిర్చి, 2 కరివేపాకు
తయారి విధానం
పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి కందిపప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత కందిపప్పులో నీటిని పోసి కుక్కర్లో పెట్టి ఉడికించాలి. మెత్తగా ఉడికిన కందిపప్పును మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి ఒక స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగించాలి.
ఆ తర్వాత సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్త పడే వరకు వేగించాలి. ఆ తర్వాత పాలకూర తరుగు వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. ఆ తర్వాత చింతపండు పులుసు, అర లీటర్ నీటిని పోసి ఒక పొంగు రానివ్వాలి. పొంగుతున్న పులుసులో సాంబార్ పొడి వేసి సిమ్ లో పెట్టి మరిగించాలి. మెత్తగా చేసుకున్న కందిపప్పు, కారం వేసి మరొకసారి మరిగించాలి.