Kitchenvantalu

Sweet Corn Paratha:స్వీట్ కార్న్ ప‌రోటాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Sweet corn Paratha:మనం సాధారణంగా పరోటాలను రకరకాలుగా స్టఫ్ చేసి చేస్తూ ఉంటాం. అలాగే స్వీట్ కార్న్ పరోటా కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా మెత్తగా ఉంటాయి. సాదారణంగా పరోటాలను మైదా పిండితో తయారుచేస్తారు. అయితే ఆరోగ్యానికి మంచిదని గోధుమపిండితో తయారి విధానం గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
స్టఫింగ్ కోసం
1 cup స్వీట్ కార్న్, 3 పచ్చిమిర్చి, ఉప్పు, చిన్న కట్ట కొత్తిమీర, 1/4 tsp వాము, 1/2 అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 tsp ఉల్లిపాయ, 2 tsp నూనె, 1/2 tsp జీలకర్ర, ఇంగువ – చిటికెడు, 1 tsp నిమ్మకాయ రసం

పిండి కోసం
2 cups గోధుమ పిండి, 2 tsp నూనె, ఉప్పు, నీళ్ళు తగినన్ని, నూనె పరాటాలు కాల్చుకోడానికి

తయారి విధానం
ముందుగా గోధుమ పిండిలో 2 tsp నూనె, ఉప్పు వేసి సరిపడా నీటిని పోస్తూ పిండిని మెత్తగా ఎక్కువసేపు వత్తుకుని సమానంగా బాల్స్ చేసి తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నానాబెట్టాలి. మిక్సీ జార్ లో స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లులి, వాము వేసి మెత్తని పేస్ట్ గా చేసుకొని పక్కన పెట్టాలి.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత Corn పేస్ట్ వేసి బాగా కలుపుతూ తడి పోయి ముద్ద అయ్యేవరకు ఉంచి ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించాలి.

నానిన పిండి ముద్దని మళ్ళీ వత్తుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తరువాత స్వీట్ కార్న్ ముద్ద ఉంచి అంచులని సీల్ చేసుకోవాలి. గోధుమ పిండి జల్లుతూ అప్పడాల కర్రతో నిదానంగా అన్నీ వైపులా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా రోల్ చేసుకుంటే పరాటాలు పగలకుండా వస్తాయి. పెనం బాగా వేడెక్కిన తరువాత పరాట వేసి రెండు వైపులా కాలనిచ్చి పైన నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి.