Healthhealth tips in telugu

Vitamin D Deficiency: ఈ లక్షణాలు ఉంటే విటమిన్ D లోపం ఉన్నట్లే..ఒకసారి చెక్ చేసుకోండి

Vitamin D Deficiency :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి లోపం ఉంటే అది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్ డి లోపం అనేక శారీరిక మానసిక సమస్యలకు కారణంగా ఉంటుంది. పసిపిల్లల నుండి, పెద్ద వారిదాకా ఈ సమస్య ఎవరినైనా వేధించవచ్చు.

దీని కారణంగా చర్మ సంబంధ సమస్యలు, జుట్టు రాలడం వంటివే కాకుండా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. విటమిన్ డి సహజసిద్దంగా సూర్యరశ్మి నుండి లభించే వనరుగా అందరికీ తెలుసు. మీ శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు మీ శరీరం విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తుంది.

విటమిన్ డి లోపం అనేది, కొన్ని ప్రధాన లక్షణాలను చూపుతుంది. వీటి గురించిన అవగాహన, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సహాయం చేస్తుంది. సూర్యరశ్మి కారణంగా ఉత్పత్తి అయ్యే విటమిన్ డి, మానవ శరీరంలో కొన్ని ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. విటమిన్ డి కి సూర్యరశ్మి ప్రధాన వనరుగా ఉంటుంది.

అంతేకాకుండా, మీరు కొన్నిరకాల ఆహార పదార్ధాల నుండి కూడా విటమిన్ డి ను పొందవచ్చు. విటమిన్ డి ని శరీరానికి తగినంత పరిమాణంలో అందివ్వగలగాలి. విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలోనే కాకుండా, తినే ఆహారం నుండి కాల్షియం శోషించడంలో కూడా సహాయ పడుతుంది.

ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. విటమిన్ డి లోపం ప్రధానంగా కొన్ని లక్షణాలను చూపుతుంది. మీరు తప్పక తెలుసుకోవలసిన ఈ అసాధారణ లక్షణాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

విటమిన్ డి లోపం : విటమిన్ డి లోపం గురించి మీరు తెలుసుకోవలసిన 5 లక్షణాలు ఇవే..

1. తరచుగా అనారోగ్యానికి గురవ్వడం..
2. తరచుగా అలసిపోవడం
3. డిప్రెషన్
4. జుట్టు రాలడం
5. చర్మ సంబంధ సమస్యలు

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.