Ayodhya Ram Temple: అయోధ్య వెళ్తున్నారా?.. వీటిని అసలు మిస్ కాకండి..
Ayodhya Ram Temple: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని చూడటానికి అయోధ్య వెళ్లుతున్నారా.. అయితే మీ ట్రావెల్ ప్లాన్ లో అయోధ్యకు దగ్గరలో ఉన్న వీటిని కూడా చేర్చుకోండి.
Triveni Sangam, Prayagraj: ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం మూడు పవిత్ర నదులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమం. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
Bara Imambara, Lucknow: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న బారా ఇమాంబర, 18వ శతాబ్దంలో నవాబ్ అసఫ్-ఉద్-దౌలా నిర్మించిన అద్భుతమైన నిర్మాణం. దీనిని తప్పనిసరిగా దర్శించాలి. ఇది ప్రత్యేకమైన చిట్టడవికి, ఆకట్టుకునే సెంట్రల్ హాల్‌కు ప్రసిద్ది చెందింది.
Nagvasuki Mandir, Prayagraj: త్రివేణి సంగమానికి సమీపంలో ఉన్న ప్రయాగ్‌రాజ్‌లోని నాగవాసుకి దేవాలయం.
Lalita Devi Temple, Naimisharanya: నైమిశారణ్యలోని లలితా దేవి ఆలయం. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు.
Bithoor: బితూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సమీపంలో గంగా నది ఒడ్డున ఉన్న చారిత్రక పట్టణం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.