Sleeping Without A Pillow:తల దిండు లేకుండా నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
Sleeping Without A Pillow:తల కింద దిండు పెట్టుకుని నిద్రించడం చాలా మందికి అలవాటు. చాలా తక్కువ మంది మాత్రమే దిండు లేకుండా కూడా నిద్రిస్తారు. అయితే మీకు తెలుసా..? నిజానికి మనకు తల కింద దిండు అవసరం లేదట. దిండు లేకుండా నిద్రించినా మన శరీరం అందుకు అనుగుణంగా అడ్జస్ట్ అవుతుందట. అలా అని చెప్పి దిండ్లను వాడే వారు సడెన్‌గా వాటిని మానకూడదని వైద్యులు చెబుతున్నారు.
ఎందుకంటే మొదట్నుంచీ దిండ్లు పెట్టుకునే అలవాటు ఉండి, సడెన్‌గా దాన్ని మానేస్తే అప్పుడు మెడ, వెన్ను నొప్పులు వస్తాయి. కనుక దిండ్లు అలవాటు ఉన్నవారు వాటిని తీసేయకూడదు. అలాగే వాడాలి. అయితే ఇక్కడి వరకు ఓకే. మరి ఒకే దిండు కాకుండా రెండు, మూడు దిండ్లు హైట్ పెంచి వాటిపై తలపెట్టి నిద్రించవచ్చా..? అంటే అలా చేయకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్రంలో చూశారుగా. దిండు ఉండడం వల్ల మెడతోపాటు వెన్నెముకకు మంచి సపోర్ట్ ఉంటుంది. అదే క్రమంలో దిండు కొంచెం ఎత్తు పెరిగినా అప్పుడు రెండింటిపై ఒత్తిడి పడుతుంది. దీంతో మెడ నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. అంతేకాదు ఆ ప్రభావం చర్మంపై కూడా పడుతుందట. అలా తల దిండ్లను ఎక్కువ ఎత్తుకు పెట్టుకుని నిద్రిస్తే అలాంటి వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని సైంటిస్టులు చేసిన పరిశోధనలో తెలిసింది.
అయితే ముందే చెప్పాం కదా. మనకు అసలు దిండ్లతో పని లేదని. కానీ దిండ్లు పెట్టుకునే అలవాటు ఉన్న వారు ఒకేసారి కాకుండా దశల వారీగా ఆ అలవాటును మానుకోవచ్చు. దీంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వెన్నెముక, మెడకు బలం కలుగుతుంది. వారు ఎప్పుడూ యవ్వనంతో కనిపిస్తారట. అంతేకాదు, దిండు లేకుండా నిద్రిస్తే చక్కని నిద్ర పడుతుందట. అయితే దిండ్లు అలవాటు ఉన్నవారు వాటిని క్రమంగా ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దిండ్లు పెట్టుకుని నిద్రించే అలవాటును మానాలనుకునే వారు మొదట రెండు, మూడు వారాల వరకు తల కింద దిండు కాకుండా ఓ టవల్‌ను మడిచి పెట్టుకుని నిద్రించాలి.
2. ఆ టవల్ ఎత్తును కొద్ది కొద్దిగా తగ్గిస్తూ నిద్రించాలి.
3. అలా చివరి వరకు ఎత్తు తగ్గిస్తూనే టవల్‌పై నిద్రించాలి. ఈ క్రమంలో చివరికి సమతలంగా ఉన్న ప్రదేశంపై నిద్రించడం అలవాటు అవుతుంది. అప్పుడు ఎంచక్కా దిండు లేకుండా నిద్రించవచ్చు. దీంతో ముందు చెప్పిన విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.