Healthhealth tips in telugu

Joint Pains:పరగడుపున అల్లం ఇలా తీసుకుంటే 3 రోజుల్లో కీళ్ల నొప్పులు మాయం

Ginger Joint Pains Home Remedies : విభిన్నమైన ఘాటైన రుచి కలిగిన అల్లంను మనం ప్రతి రోజు వంటల్లో వేసుకుంటూ ఉంటాం. పురాతన కాలం నుండి అల్లంను వైద్యంలో ముఖ్యంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా హెల్ప్ చేస్తాయి. COX-2 నిరోధకాలు నొప్పి మరియు మంట చికిత్సకు ఉపయోగించే మందులు.వీటి మాదిరిగానే పనిచేసే శోథ నిరోధక సమ్మేళనాలు అల్లంలో ఉంటాయి. ఆర్థరైటిస్‌ చికిత్సలో అల్లం బాగా హెల్ప్ చేస్తుంది.

మంట అనేది రోగనిరోధక ప్రతిస్పందన, ఇదిశరీరంలో గాయాలను నయం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాటం చేయటానికి సహాయ పడుతుంది. మంటను తగ్గించే అల్లం యొక్క సామర్ధ్యం అనేక వైద్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇన్ఫ్లమేషన్ స్వీయ-రక్షణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

దీని ద్వారా శరీరం తెల్ల రక్త కణాలను సంక్రమణను ఎదుర్కోవటానికి మరియు బ్యాక్టీరియా వంటి హానికరమైన జీవులను తొలగించడానికి సహాయాపడుతుంది. ఈ మంట నార్మల్ గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అదే దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఈ మంట కీళ్ల నొప్పుల చుట్టూ చేరి కీళ్ల నొప్పులను పెంచుతుంది.

అలాంటి నొప్పులను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజు అల్లంను తీసుకోవాలి. అలాగే అల్లం రసంను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసిన నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు వచ్చాయంటే బాధ విపరీతంగా ఉంటుంది. భరించటం కూడా చాలా కష్టం. అల్లం కీళ్ల నొప్పులను తగ్గించటమే..

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.