Pippi Pannu:పిప్పిపన్ను నొప్పిని క్షణాల్లో తగ్గించే సింపుల్ చిట్కా…ఇలా చేస్తే చాలు
Pippi Pannu Home Remedies : ఈ రోజుల్లో చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. మనం తీసుకున్న ఆహారం పంటిలో ఇరుక్కున్నప్పుడు అది బ్యాక్టీరియా మారి నొప్పి కి గురిచేస్తుంది. పిప్పి పన్ను, పుచ్చిన పళ్ళు ఉన్నప్పుడూ చల్లని పదార్ధాలు తీసుకుంటే నొప్పి బాగా వస్తుంది.
పంటి, పిప్పి పన్ను నొప్పి వచ్చినపుడు విపరీతమైన బాధ ఉంటుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగున్నట్టే. పంటి నొప్పి గా ఉన్నప్పుడు వికారం, తలనొప్పి, జ్వరం వచ్చినట్లు ఉంటుంది. ఏమి తినలేము.
దంత సమస్యలకు పటిక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పటిక రుచి వగరుగా ఉన్నప్పటికి నొప్పిని తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిన్న పటిక ముక్క వేసి పది నిమిషాలు అలా వదిలేస్తే పటిక నీటిలో కరుగుతుంది. ఈ నీటిని నోటిలో పోసుకొని 30 నుంచి 40 సెకన్ల వరకూ బాగా పుక్కిలించి తరువాత నీటిని ఉమ్మేయాలి. ఇలా గ్లాస్ లో ఉన్న నీరు అంతా అయ్యేవరకు చేయాలి.
వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొంచెం ఉప్పు కలిపి పిప్పి పన్ను ఉన్న చోట అప్లై చేయండి. 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి. ఆ తర్వాత కడిగేయాలి. అప్పుడు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
నోట్లో ఉండే బాక్టీరియా మొత్తం నశిస్తుంది. పిప్పి పళ్లకు కారణం అయ్యే సూక్ష్మ జీవులు చనిపోతాయి.1 లేదా 2 రోజులకు మించి పంటినొప్పితో బాధపడుతుంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే..
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.