Coriander Stem :కొత్తిమీర ఆకులు తిని కాడలను పాడేస్తున్నారా…ఈ విషయం తెలిస్తే అస్సలు పాడేయరు
coriander stalks Health benefits In telugu : ఈ చలి కాలంలో ఆకుకూరలు విరివిగా లభిస్తాయి. ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తిమీర గురించి చెప్పుకుంటే కొత్తిమీర వాసన అద్భుతంగా ఉండటమే కాకుండా కూరలకు, వంటలకు మంచి రుచిని అందిస్తుంది.
మనలో చాలామంది కొత్తిమీర ఆకులను వాడుతూ కాడలను పాడేస్తూ ఉంటారు. కానీ వాటిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఔషధ విలువలు చాలా ఉన్నాయి. కొత్తిమీర కాడలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా కొత్తిమీర తింటే ఐరన్ కుడా లభిస్తుంది.కొత్తిమీర కాడల్లో సిట్రోనెలోల్ పుష్కలంగా ఉంటుంది.
శరీరంలో సూక్ష్మజీవుల పెరుగుదలతో పోరాడటానికి, అల్సర్ లకు చికిత్స చేసే గొప్ప క్రిమినాశకంగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర కాడలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి, ఆందోళన తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కొత్తిమీరలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటిఆక్సిడంట్ల వలె కూడా పనిచేసి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల నియంత్రణలో కూడా సహాయపడతాయి.
జీర్ణక్రియ రేటుని కూడా పెంచుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులు అయిన అజీర్ణం, వాంతులు,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి వాటిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. చర్మ సంరక్షణలోనూ కొత్తిమీర కాడలు కీలకపాత్ర పోషిస్తుంది.
కొత్తిమీర కాడలలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, కండరాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ సారి కాడలను పాడేయకుండా తినండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.