Krishna Mukunda Murari Serial: ‘కృష్ణ ముకుంద మురారి’లో రేవతి (మాధవి) గురించి ఈ విషయాలు తెలుసా..?
Krishna Mukunda Murari Serial:‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా మంచి పేరు రావటమే కాకుండా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మాధవి గురించి తెలుసుకుందాం. ఈ సీరియల్ లో మాధవి రేవతి పాత్రలో నటిస్తుంది. రాయలసీమ కర్నూల్ లో పుట్టి పెరిగిన మాధవి నంద్యాలలో కోడలిగా అడుగు పెట్టారు.
పెళ్లి అయ్యి పిల్లలు పెద్దవారు అయ్యాక ఈ రంగానికి వచ్చి సక్సెస్ అయ్యారు. నటనా రంగానికి రాక ముందు మాధవి బ్యుటీషియన్‌గా పార్లర్ నడిపేవారు. పదవ తరగతి వరకు చదివిన మాధవికి డాన్స్, యాక్టింగ్, గేమ్స్ అంటే ఇష్టం.
యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. అలా చేస్తూ ‘మూడు ముళ్ల బంధం’ సీరియల్‌కి సెలెక్ట్ అయ్యి.. ఆ తరువాత ‘ఆడదే ఆధారం’, ‘జాబిలమ్మ’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘గృహలక్ష్మి’, ‘కృష్ణ’, ఇలా కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం లేకుండా మంచి మంచి పాత్రలు చేస్తూ గత పదేళ్లుగా బిజీ ఆర్టిస్ట్‌గా సక్సెస్ గా ముందుకు సాగుతుంది.