పూజాహెగ్డే తండ్రి ఏమి చేస్తారో తెలుసా…?
Telugu Herine Pooja Hegde :ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా వినిపించే పేరు పూజా హెగ్డే. వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 2014లో ఎంట్రీ ఇచ్చి, తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన అలవైకుంఠ పురంలో మూవీతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకుంది.
సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలంలో జిగేలు రాణి పాటకు రామ్ చరణ్ తో జోడీ కట్టిన పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు కూడా విడుదల అయ్యాయి. అయితే అనుకున్న పలితం రాలేదు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో మంజు నాథ్ హెగ్డే, లతా హెగ్డే దంపతులకు పూజా హెగ్డే జన్మించింది.
అయితే తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడడంతో పూజా అక్కడే స్టడీస్ పూర్తిచేసింది. స్టార్ హీరోల సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తున్న పూజాహెగ్డే మరికొన్ని మూవీస్ కి కమిట్ అయినట్లు టాక్. అన్నట్టు నిజానికి సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట పూజాహెగ్డే పేరే వినిపించింది.