MoviesTollywood news in telugu

Guppedantha manasu serial :గుప్పెడంత మనసు వసుధార బావ రాజీవ్ గురించి ఈ విషయాలు తెలుసా..?

Guppedantha manasu serial Today Episode : స్టార్ మాలో వచ్చే సీరియల్స్ కి చాలా క్రేజ్ ఉంది. సీరియల్స్ కి గల క్రేజ్ నేపథ్యంలో గుప్పెడంత మనసు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. కార్తీక దీపం రేటింగ్ మాదిరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సీరియల్ లో నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తున్నారు. ఇందులో హీరోయిన్ కి బావగా నెగెటివ్ రోల్ లో నటిస్తున్న రాజీవ్ అసలు పేరు గోపా శ్యాం.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో జన్మించిన రాజీవ్ కి ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. స్కూల్, కాలేజీ రోజుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎం సి ఏ పూర్తిచేసిన రాజీవ్ తండ్రి ఎంకరేజ్ మెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. సినిమాల్లో నటిస్తూ ఆహ్వానం సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సీరియల్ తో మంచి ప్రేక్షకాదరణ పొందాడు. మొదటి సీరియల్ అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సీరియల్స్ లో రాజీవ్ నటించాడు. పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. అలాగే సినీ అవకాశాలతో కూడా బిజీగా ఉన్నాడు.

ఈ సీరియల్ లో రాజీవ్ కొన్ని రోజులు నటించాక డైరెక్టర్ కొంత గ్యాప్ ఇచ్చే మరల ఇప్పుడు ఎంటర్ చేసారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ సీరియల్ లో ఇద్దరు విలన్స్ ఉన్నారు. దాంతో సీరియల్ చాలా ఆసక్తికరంగా మారింది. అయితే వసుధారకు తన బావ ఎంటర్ అయినా విషయం ఇంకా తెలియలేదు. మారు వేషంలో కనిపించాడు.