cracked heels :కొబ్బరి నూనెతో ఇలా చేస్తే చాలు కాలి పగుళ్లు శాశ్వతంగా మాయం అవుతాయి…
cracked heels Home Remedies in winter : చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాదాల పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. పాదాల పగుళ్ళు ప్రారంభంలో అంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం కనబడుతుంది.
మనలో చాలామంది పాదాల పగుళ్లు కనబడగానే Ointment కోసం చూస్తారు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే Ointment జోలికి వెళ్లకుండా ఉంటారు.రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేయాలి.
మసాజ్ చేయడానికి ముందు పాదాలను మురికి వదిలే వరకు బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఆ తర్వాత నూనె రాసి మసాజ్ చేసి సాక్స్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం పాదాలను శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి
కొబ్బరి నూనె పొడి చర్మానికి తేమను అందిస్తుంది. పగిలిన మడమలకు కొబ్బరినూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ E, ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయటమే కాకుండా కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.
కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే సర్క్యులేషన్ బాగా జరిగి పాదాలు తేమని కోల్పోకుండా ఉంటాయి. పాదాల పగుళ్లు వచ్చినప్పుడు ఖరీదైన Ointments వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.