Potato Curry:రుచికరమైన ధాబా స్టైల్ ఆలు కర్రీ ఇలా చేయండి -పూరి, చపాతీలోకి సూపర్…
Potato Curry: బంగాళదుంపలతో చేసిన కూర అయినా వేపుడైనా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి పూరీలతో పాటు వేడివేడిగా బంగాళదుంప కూర తింటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పే పొటాటో కర్రీ దోసెలకు కూడా చాలా బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు
3 ఉడికించిన బంగాళాదుంపలు, 4 టేబుల్ స్పూన్లు నూనె, 1 tsp క్రష్ చేసిన ధనియాలు, 2 వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 2 చిటికెడు ఇంగువ,1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు తరిగిన టమోటాలు, 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 3/4 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1.25 స్పూన్ ఎర్ర కారం, 1/2 టీస్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/4 టీస్పూన్ పసుపు, ఉప్పు, 400 ml నీరు, కొత్తిమీర, 1 టీస్పూన్ కసూరి మేతి
తయారి విధానం
పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, క్రష్ చేసిన ధనియాలు, సోంపు గింజలు, వాము,ఇంగువ వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి… ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమాటా మొక్కలు వేసి టమాటా మెత్తగా అయ్యేవరక ఉడికించాలి.
ఆ తర్వాత గరం మసాలా, చాట్ మసాలా,ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి,కారం,పసుపు, ఉప్పు వేసి ఒక నిమిషం వేగాక ఉడికిన బంగాళదుంపలను మెత్తగా చేసి వేసి బాగా కలిపి నీటిని పోసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర, కస్తూరి మేతి వేసి నూనె పైకి తేలే వరకు మీడియం మంట మీద ఉడికించాలి.