MoviesTollywood news in telugu

Guppedanta Manasu serial today: ‘గుప్పెడంతమనసు’ సీరియల్ లో చేస్తున్నఅనుపమ ఎవరో తెలుసా!

Guppedantha Manasu serial today: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసు సీరియల్లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఆమె పేరు అనుపమ. అనుపమ జగతి,మహేంద్ర స్నేహితురాలు. అనుపమ అసలు పేరు చంద్ర లక్ష్మణ్.

మళయాల నటి చదువు అంతా చెన్నైలోనే సాగింది. హోటల్ మానేజ్మెంట్ చదువుతున్న సమయంలో సినిమాలో అవకాశం వచ్చింది. 2002 లో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన చంద్ర దాదాపుగా తమిళం, మళయాలంలో 10 సినిమాలు చేసింది.

మొదట మమతల కోవెల, సీతాకోక చిలుక సీరియల్స్ లో నటించి.. ఇప్పుడు గుప్పెడంత మనస్సు సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ లో కీలకమైన మరియు మంచి పాత్ర దొరికింది. అలాగే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తుంది.

2021లో పెళ్లి చేసుకున్న చంద్రకి ఇప్పుడు ఓ బాబు ఉన్నాడు. ఓ వైపు కుటుంబం మరోవైపు కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్ గా ముందుకు సాగుతుంది.