Kitchenvantalu

Cluster Beans Fry:గోరుచిక్కుడు కాయ వేపుడు ఇలా చేస్తే అదుర్స్…రైస్ మరియు రోటీస్ కి బాగుంటుంది

Easy Cluster Beans Fry Recipe:గోరుచిక్కుడులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలామంది గోరుచిక్కుల్లో పీచు శాతం ఎక్కువగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే రెసిపీ చాలా బాగుంటుంది. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. లేతగా ఉన్న గోరుచిక్కుడుకాయలను ఉపయోగించాలి.

కావలసిన పదార్ధాలు
400 గ్రాముల గోరుచిక్కుడు, 1 స్పూన్ ఉప్పు, ఉడికించటానికి నీరు

గసగసాల మసాలా కోసం
7-8 ఎండు మిర్చి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఎండు కొబ్బరి, ఉప్పు

ఫ్రై కోసం
1/4 కప్పు నూనె, 3/4 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఉప్పు, 2 చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిటికెలు గరం మసాలా, కొత్తిమీర

తయారి విధానం
గోరుచిక్కుడు కాయలను చిన్న చిన్న ముక్కలుగా కే చేసి ఉప్పు వేసి నీటిని పోసి 80 శాతం ఉడికించాలి. మిక్సీ జార్ లో 7-8 ఎండు మిర్చి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఎండు కొబ్బరి, ఉప్పు, కొంచెం నీటిని చేర్చి మెత్తని పేస్ట్ గా చేయాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తపడే వరకు వేగించాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. ఆ తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు,పసుపు,ఉప్పు వేసి వేగించాలి. 3-4 నిమిషాల తర్వాత, గసగసాలు మసాలా మరియు కొత్తిమీర వేసి మూతపెట్టి మీడియం మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చిటికెడు గరం మసాలా వేసి బాగా కలపాలి. అంతే Cluster Beans Fry రెడీ. ఈ కూర రైస్ మరియు రోటీస్ రెండింటికీ చాలా రుచిగా ఉంటుంది.