Sarileru Neekevvaru:సరిలేరూ నీకేవ్వరు సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Sarileru Neekevvaru Movie:సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అవకాశం వదులుకుంది సాయి పల్లవి. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సరిలేరూ నీకేవ్వరు చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందాన్న నటించింది.
అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా తన సత్తాను చాటింది. బాహుబలి 2 టీఆర్పీ రేటింగ్ లని సైతం క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అయితే ఈ చిత్రానికి మొదటగా హీరోయిన్ గా సాయి పల్లవి నీ అనుకున్నారట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేదని అందుకే సినిమాలో నటించలేదు అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమా ను rashmika అవకాశం అంది పుచుకుంది. అయితే సాయి పల్లవి ఇప్పటవరకూ చేసిన సినిమాలు చాలా సెలెక్టివ్ గా చేసినవే. కెరీర్ మొదటనుండి మంచి సినిమాల్లో నటిస్తుంది.
ఏదేమైనా సాయి పల్లవి సెలెక్టివ్ గా పాత్రలు చేయడంలో మిగతా హీరోయిన్ లకు ఎలాంటి పోటీని ఇవ్వకుండా, తనకు తాను సొంత స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.