Chilli Paneer:చిల్లీ పన్నీర్ ఇలా చేస్తే రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుంది…ఒక్క ముక్క కూడా వదలరు
Chilli Paneer Recipe:చిల్లీ పన్నీర్ అనేది ఫ్రైడ్ రైస్ కి చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ లలో చాలా ప్రసిద్ది చెందింది. ఈ రెసిపీని మన ఇంటిలో చాలా సులభంగా చేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు
పనీర్ పూత కోసం
1 స్పూన్ మైదా, 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/4 టీస్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ నీరు, 200 గ్రా పనీర్, నూనె – వేగించటానికి
గ్రేవీ కోసం
2 టేబుల్ స్పూన్లు నూనె, 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1.5 స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 tsp తరిగిన అల్లం, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్స్ తరిగిన, 10-15 క్యాప్సికమ్ క్యూబ్స్, ఉప్పు, 1 స్పూన్ ముదురు సోయా సాస్, 1.5 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1.5 స్పూన్ చిల్లీ పేస్ట్/షెజ్వాన్ పేస్ట్, 1 స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీస్పూన్ పెప్పర్ పౌడర్, 300 ml నీరు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, చక్కెర పావు స్పూన్
తయారి విధానం
ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి దానిలో పన్నీర్ ముక్కలు వేయాలి. ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి పిండి అంతా పన్నీర్ కి అంటుకునే వరకు బాగా కలపాలి. ఈ పన్నీర్ ముక్కలను మీడియం మంట మీద గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేగించాలి. ఆ తర్వాత క్యాప్సికం, ఉల్లిపాయ పెద్ద ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్,సోయా సాస్,గ్రీన్ చిల్లీ సాస్,షెజ్వాన్ పేస్ట్,టొమాటో సాస్, తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల్ పొడి వేసి 5 నిమిషాల పాటు వేగించాలి.
ఆ తర్వాత 300 ml నీరు వేసి High Flame లో రెండు నిమిషాలు వేగించి పనీర్ ముక్కలను వేసి 2 నిమిషాలు ఉడికించాలి. ఉడుకుతున్న గ్రేవీలో, 3 టేబుల్ స్పూన్ల నీటిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి, చిక్కగా మారే వరకు ఎక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడకనివ్వండి. గ్రేవీ చిక్కగా ఉన్నప్పుడు, అంగుళం పొడవున్న స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను వేసి మరో నిమిషం అయ్యాక పొయ్యి ఆఫ్ చేసి సర్వ్ చేయటమే.