Face Glow Tips:రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఎంత నల్లగా ఉన్నా తెల్లగా మెరిసిపోతారు
Sugar and coconut oil face glow Tips: ఈ మధ్య కాలంలో ఎండ వలన, పొల్యూషన్ వల్ల చర్మం నల్లగా మారుతూ ఉంటుంది. నల్లగా మారిన చర్మం తెల్లగా మారాలంటే మనలో చాలామంది మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు దాని కోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో సులభంగా నల్లని ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల మైల్డ్ బాడీ షవర్, మూడు స్పూన్ల పంచదార, అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.
పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మృత చర్మ కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మానికి తగినంత తేమ అందుతుంది. వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. రాత్రి పడుకొనే ముందు చేస్తే సరిపోతుంది. రాత్రి సమయంలో కుదరని వారు ఉదయం సమయంలో చేయవచ్చు.
ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. అలాగే పంచదార మంచి స్క్రబ్ గా పనిచేసి చర్మంలో ఉన్న మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నూనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.
అయితే ఆర్గానిక్ కొబ్బరి నూనె వాడితే మంచిది. ఈ చిట్కాను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చులో అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కాను చేయటానికి ప్రయత్నం చేసి మంచి పలితాలను పొందండి. అన్ని ఇంగ్రిడియన్స్ సులభంగానే లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.