Beauty TipsHealth

Pigmented Lips:కొబ్బరి నూనెలో ఇది కలిపి పెదాలకు రాస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

Home Remedies For Pigmented Lips in telugu :పెదాలు అందంగా ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు, వేల కొద్ది డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. పెదాల సంరక్షణకు పెద్దగా ఖర్చు పెట్టాలసిన అవసరం లేదు. ఇంటిలో సులభంగా ఉండే పదార్ధాలను ఉపయోగించి నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి దానిలో పావుస్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడి, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పెదాలకు రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే నల్లని పెదాలు క్రమంగా గులాబీ రంగులోకి మారతాయి.

చలికాలంలో సహజంగా పెదాలు పగలడం చూస్తుంటాం. దీంతో పెదాలపై పొలుసులు రావడం, డ్రైగా మారిపోవడం జరుగుతుంటుంది. అందుకే లిప్ బామ్ లు వాడుతుంటాం. ఈ చిట్కా ఫాలో అయితే లిప్ బామ్ లు వాడవలసిన అవసరం లేదు .

కొబ్బరి నూనె పెదాలు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. బేకింగ్ సోడా పెదాల చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. దాల్చినచెక్కలో ఉన్న లక్షణాలు నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.