Kitchenvantalu

steel utensils:స్టీల్ పాత్రల్లో వంట చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Cooking in steel utensils in telugu :మనం సాధారణంగా స్టీలు లేదా నాన్ స్టిక్ లేదా అల్యూమినియం పాత్రలలో వంటలు చేస్తూ ఉంటాం. అయితే ఎక్కువగా అల్యూమినియం పాత్రలో వంటలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అల్యూమినియం పాత్రలలో వంటలు మంచివి కాదని ఆరోగ్య నిపుణులు చెప్పడంతో… మనలో చాలా మంది ఇప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల్లో వంటలు చేయడం ప్రారంభించారు.

అయితే ఏటువంటి వంట పాత్రలు వాడితే మన ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం . స్టీల్ పాత్రలో వంటలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను చూద్దాం. స్టీల్ పాత్రలో ఆహారాన్ని వండేటప్పుడు చాలా తొందరగా అడుగు అంటుతుంది. అందువల్ల జాగ్రత్తగా తక్కువ మంట మీద ఆహారాన్ని వండాలి. కాబట్టి వండే సమయంలో మధ్యస్థం లేదంటే తక్కువ మంటపై ఆహారాన్ని ఉడికించటం అలవాటు చేసుకోవాలి.

స్టీలు పాత్రలకు ఎలాంటి టెప్లాన్ పూత ఉండదు. కాబట్టి ఆహారం వండుతున్నప్పుడు అడుగున అంటుకుంటుంది. స్టీల్ పాన్ లను ఎప్పుడు గ్రీల్ చేయకూడదు. ఎందుకంటే గ్రీల్ చేసే పాత్రను ఎక్కువసేపు మంటపై ఉంచాల్సి వస్తుంది. అది మెటల్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా డీప్ ఫ్రై కూడా స్టీల్ పాన్లలో చేయకూడదు. ఎందుకంటే స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటం వలన స్టీల్ పాన్ లో డీప్ ఫ్రై చేసినప్పుడు అది స్మోక్ పాయింట్ కి చేరి పసుపు లేదా జిగటగా మారిపోతుంది. దాన్ని శుభ్రం చేయటం చాలా కష్టంగా మారుతుంది.