Healthhealth tips in telugu

Benefits of Foot Massage:రాత్రి పడుకొనే ముందు 10 నిమిషాలు అరికాళ్ళకు మసాజ్ చేస్తే ఏమి అవుతుందో తెలుసా?

Benefits of Foot Massage : శరీరానికి మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.ఈ విషయం మనకు తెలిసిందే. అయితే అరికాళ్లకు మసాజ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రి సమయంలో 10 నిమిషాల పాటు అరికాళ్లకు మసాజ్ చేస్తే శారీరక మరియు మానసిక ప్రయోజనాలు కలుగుతాయి.

అరి కాళ్లకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రక్తప్రసరణ చాలా ముఖ్యం. రక్తం శరీరంలోని అన్ని భాగాలకు చేరితేనే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. టెన్షన్, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది.

పాదాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పాదాల వాపులు కూడా తగ్గుతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అటువంటివారు ఈ విధంగా అరికాళ్ళకు మసాజ్ చేసుకుంటే అలసట తగ్గి మంచి నిద్ర పడుతుంది. మన శరీరంలో రక్తప్రసరణ బాగా సాగితే ఎటువంటి సమస్యలు ఉండవు.

రోజంతా ఉండే అలసటను తగ్గించి రిలాక్స్ అనుభూతిని కలిగిస్తుంది. మసాజ్ చేయడానికి ఆవ నూనె వాడితే మంచిది. ఒకవేళ అవ నూనె లేకపోతే కొబ్బరి నూనె అయినా వాడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.