Hair Care Tips:షాంపూ లో కలిపితే…జుట్టు ఎంత పలుచగా ఉన్న జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Onion and alovera Hair fall Tips In telugu : ప్రతి ఒక్కరూ పొడవైన, అందమైన జుట్టు కావాలని కోరుకోవడం సహజమే. అయితే ప్రస్తుతం మారిన జీవన శైలి పరిస్థితులతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఎదుర్కొంటారు. ఈ సమస్య ప్రారంభం కాగానే చాలా మంది రకరకాల ప్రొడక్ట్స్ వాడి రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసిగి పోతారు.
అయితే సమస్య కు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. జుట్టురాలే సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరకాలి అంటే కాస్త ఓపికగా ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అసలు జుట్టు .రాలటానికి పోషకాహార లోపం వంటివి కూడా కారణం అవుతాయి.
ఈ చిట్కాలు ఫాలో అవుతూ పోషకాహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ఉంటే తొందరగా మంచి ఫలితం కనబడుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. మనం ఈ చిట్కా కోసం కేవలం మూడే మూడు .ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
మనం రెగ్యులర్ గా వాడే షాంపూ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఉల్లిపాయ రసం,కలబంద జెల్ వేసి బాగా కలిపి తలను రుద్దుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
ఈ చిట్కాలో ఉపయోగించిన ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు రాలకుండా చేయటమే కాకుండా జుట్టురాలే సమస్యకు ఒక కారణం అయినా చుండ్రు ని కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి సహాయ పడటమే కాకుండా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. ఇక కలబంద జుట్టు పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.