Face Glow Tips:ఇలా చేస్తే పైసా ఖర్చు లేకుండా ముఖం మీద ముడతలు,నల్లని మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది
Rice and almond oil Face Glow Tips in telugu : ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా సమర్ధవంతంగా ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలు లేకుండా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ఈ రెమిడీ కోసం ఉడికించిన్న అన్నం, బాదం నూనె తీసుకుంటున్నాము. అన్నంలో ఉన్న పోషకాలు ముఖం మీద ఉండే ఫిగ్మెంటేషన్ తొలగించి చర్మం యవన్నంగా ఉండేలా చేస్తుంది. చర్మ సంరక్షణలో బియ్యం, అన్నం, బియ్యంపిండి ఈ మూడు చాలా బాగా సహాయపడతాయి.
ఒక కప్పు అన్నం తీసుకొని మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి. బాదం నూనెలో ఉన్న పోషకాలు ముఖం మీద మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటిఓ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా ముఖం మీద ముడతలు, మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.