MoviesTollywood news in telugu

Tollywood:ప్లాప్ అవుతుందని తెలిసి బాలకృష్ణ చేసిన సినిమా…ఎందుకు చేయాల్సి వచ్చిందో ?

Balakrishna Movies:కొన్ని సినిమాలు ఆడవని ,జనాలకు ఎక్కవని తెల్సినా తీయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇటు హీరో,అటు డైరెక్టర్ కి అడుగడుగునా సంతృప్తి లేకున్నా సినిమా పూర్తిచేయాల్సి ఉంటుంది. తీరా రిలీజయ్యాక అది డిజాస్టర్ అవుతుంది. ఇలాంటి ప్రయోగం నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ఓ సినిమా విషయంలో స్పష్టంగా తేలిపోయింది. ఆ సినిమాయే తిరగబడ్డ తెలుగు బిడ్డ.

అవును ఎపుడు వచ్చిదో ఎప్పుడు పోయిందో తెలీని తిరగబడ్డ తెలుగు బిడ్డ మూవీ చేయడం బాలయ్యకు,అలాగే డైరెక్టర్ ఏ కోదండ రామిరెడ్డికి కూడా ఇష్టం లేదు. అయితే ఎన్టీఆర్ వత్తిడి మేరకు పట్టాలెక్కించారు. సినిమా తీస్తున్న సమయంలో ఎక్కడా హోప్స్ లేవు.

ఈ సినిమా ఇష్టం లేకున్నా ఎందుకు చేయాల్సి వచ్చిందో కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.ఎన్టీఆర్ సీఎం గా ఉండగా, ఆయన ఒకే చేసిన అనసూయమ్మ గారి అల్లుడు సినిమా డైరెక్షన్ చేశానని కోదండ రామిరెడ్డి చెప్పారు. అది సూపర్ కావడంతో మరో సినిమా ఈయన డైరెక్షన్ లోనే తీయమని ఎన్టీఆర్ సూచించారట.

అలా చెప్పిన కథే తిరగబడ్డ తెలుగు బిడ్డ. కానీ ఆ కథ కోదండ రామిరెడ్డికి నచ్చలేదు. దాంతో పక్కన పెట్టేసారు. అయితే కొంతకాలం తరువాత ఎన్టీఆర్ మళ్ళీ ఫోన్ చేసి, అదే సినిమా చెయ్య మనడంతో అయిష్టంగానే ఒకే చెప్పాల్సి వచ్చింది. నిజానికి బాలయ్యకు కూడా నచ్చలేదు. కానీ చేయాల్సి వచ్చి చేసారు. డిజాస్టర్ అయింది.