White Hair: తెల్లజుట్టు వచ్చిందని ఏవి పడితే వాటిని వాడకండి.. కెమికల్స్‌కు బదులుగా వీటిని వాడితే చాలు..
White Hair turn black: ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే హెయిర్ డై(Hair dye) వాడుతూ ఉంటారు. అయితే హెయిర్ డైలలో రసాయనాలు ఎక్కువగా ఉండుట వలన జుట్టు బలహీనంగా మారటమే కాకుండా మెదడు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది.
అల్డీమర్స్, మతిమరుపు వంటి మెదడు సంబంధిత వ్యాధులు రావడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. హెయిర్ డై వాడటం కన్నా ఇంటిలో సహజసిద్దంగా చేసుకున్న చిట్కాలను ఉపయోగించటం మంచిది. తెల్లజుట్టును నల్లగా మార్చటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఒక ఇనుప బాండీ(iron pan) లో 4 నుంచి 5 స్పూన్ల హెన్నా పౌడర్(henna powder) ని వేయాలి. హెన్నా పౌడర్(henna powder) ఇంటిలో తయారుచేసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల బ్లాక్ టీ(black tea) పౌడర్, ఒక స్పూన్ నిమ్మరసం (Lemon Juice), కొంచెం నీటిని పోసి ఉండలు లేకుండా కలిపి 8 గంటల పాటు అలా వదిలేయాలి.
ఆ తర్వాత ఆ పేస్ట్ ని మరొక సారి బాగా కలిపి జుట్టు కుదుళ్లకు, జుట్టు పాయలుగా విడదీస్తూ పొడవునా అప్లై చెయ్యాలి. దాదాపుగా గంట తర్వాత తలస్నానం చేయాలి. తలస్నానం చేసినప్పుడు వేడి నీరు ఉపయోగించకుండా సాదారణమైన నీటిని ఉపయోగించాలి. అలాగే గాఢత లేని షాంపూ మాత్రమే ఉపయోగించాలి.
ఈ విధంగా పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే హెయిర్ డైలు అవసరం లేకుండానే జుట్టు తొందర్లోనే నల్లగా నిగనిగలాడుతుంది. జుట్టుకి మరింత పోషణ కావాలని అనుకొనే వారు ఈ పేస్ట్ లో భృంగరాజ్ పొడి, ఉసిరికాయ పొడి కూడా వాడవచ్చు. వీటిని వాడటం వలన జుట్టు కుదుళ్ల PH స్టాయిలు సమతుల్యంగా ఉంటాయి.
జుట్టు కుదుళ్లలో అధికంగా ఉత్పత్తి అయ్యే నూనెను నియంత్రిస్తాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. జుట్టు రాలడమనే సమస్య వీటి వల్ల పరిష్కారమవుతుంది. అంతేకాదు జుట్టు మృదువుగా, సిల్కీగా ఉంటుంది. తలలో చుండ్రు, పుండ్లు వంటి సమస్యలు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News