Cracked Heels:ఈ 1 చిట్కా పాటిస్తే చాలు మీ కాలి పగుళ్ళు శాశ్వతంగా మాయం అవుతాయి…ఇది నిజం
Cracked Heel In telugu : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తూ ఉంటాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, పెరుగుతున్న వయస్సు, గట్టి నెల మీద ఎక్కువసేపు నిలబడటం,మధుమేహం,థైరాయిడ్ వంటి సమస్యలు కారణంగా పాదాల పగుళ్ల సమస్య వస్తుంది.
కొంత మంది పాదాల పగుళ్ల సమస్యను పెద్దగా పట్టించుకోరు. అప్పుడు సమస్య తీవ్రమై నడవటానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి సమస్య ఎదురు కాకుండా సమస్య తీవ్రం కాకుండానే ఇంటి చిట్కాల ద్వారా పాదాల పగుళ్ళను తగ్గించుకోవాలి. అయితే ఈ పగిలిన పాదాలను ఎక్కువకాలం పట్టించుకోకపోతే, త్వరగా నయం చేసుకోకపోతే.. సోరియాసిస్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతాయి.
పగిలిన పాదాలను స్మూత్ గా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవడానికి న్యాచురల్ రెమిడీస్ మీ ఇంట్లోనే ఉన్నాయి. తరచుగా ఉపయోగించే వస్తువులతోనే పాదాల పగుళ్లను నయం చేసుకోవచ్చు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ బంగాళాదుంప రసం, అరస్పూన్ నిమ్మరసం, కొంచెం తెలుపు రంగు టూత్ పేస్ట్ వేసి బాగా కలిపి పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే 4 రోజుల్లో పాదాల పగుళ్లు మాయం అయ్యి మృదువుగా మారతాయి.
ఈ చిట్కా కోసం ఉపయోగించిన బంగాళాదుంప బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి పగుళ్లను తగ్గిస్తుంది. నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా, పొడిగా ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. మృత కణాలను తొలగించి పగుళ్లను తగ్గించి మృదువుగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.