Tomato Karivepaku Chutney: ఈ పచ్చడిని ఇలా చేసి వేడి వేడి అన్నంలోకి నెయ్యితో తింటే రుచి బాగుంటుంది
Tomato Karivepaku Chutney Recipe: టమాట పచ్చడిలోకి పూదీనా,కొత్తిమీర యాడ్ చేసి పచ్చళ్లు చేస్తూనే ఉంటాం. కరివేపాకుతో తాలింపు వేస్తాం. కాని కరివేపాకుతో టమాట పచ్చడి ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
టమాటో – 300 గ్రాములు
కరివేపాకు 1 కప్పు
కొత్తిమీర – ¼ కప్పు
నువ్వులు – 1.5 టేబుల్ స్పూన్
పచ్చికొబ్బరి తురుము – ½ కప్పు
పచ్చిమిర్చి – 6
నూనె – 3 టేబుల్ స్పూన్స్
తాలింపు కోసం..
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
మినపప్పు – ½ టీ స్పూన్
పచ్చి శనగపప్పు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనే వేడిచేసి అందులోకి నువ్వులు వేసి చిట పటలాడనివ్వాలి.
2.తరువాత అందులోకి కొబ్బరి తురుము,పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.
3.వేగిన పచ్చిమిర్చిలో కరివేపాకు వేసి పసరు వాసన పోయే వరకు వేపుకోవాలి.
4.వేగని కరివేపాకు, నువ్వులు అన్ని మిక్సి జార్ లో వేసుకోని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
5.అదే ప్యాన్ లోకి మరో స్పూన్ ఆయిల్ వేసి అందులో టమాట ముక్కలు,ఉప్పు వేసి మెత్తగా మగ్గించాలి.
6.మగ్గిన టమాటలను గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ లో వేసి మరో రెండు మార్లు మిక్సిలో వేసి తిప్పుకోవాలి.
7.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనే వేసి తాలింపులు వేసుకోని వేగిన తాలింపును పచ్చడిలోకి కలుపుకోవాలి.
8.అంతే వేడి వేడి అన్నం కరివేపాకు టమాట పచ్చడి టేస్ట్ చూసి ఎలా ఉందో చూసేయండి.
Click Here To Follow Chaipakodi On Google News