Beauty TipsHealth

Hair Care Tips:ఈ గింజలతో నూనె తయారుచేసి వాడితే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Hair Fall and growth Tips In Telugu : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవటానికి గురివింద గింజలు ఉపయోగించి నూనె తయారు తయారుచేసుకోవాలి. ఈ గింజలు మనలో చాలా మందికి తెలుసు. ఈ గురివింద గింజలు ఆయుర్వేదం షాప్ లో అందుబాటులో ఉంటాయి. పల్లెటూర్లో అయితే పొలాల్లో దొరుకుతాయి.

ఈ గింజలను 20 నుంచి 30 వరకు తీసుకొని మిక్సీలో వేసి పప్పులా చేసుకోవాలి. ఈ పప్పును ఒక మందపాటి గుడ్డలో వేసి మూట కట్టి స్టౌ పై అర గ్లాసు పాలను పెట్టి ఈ మూటను దానిలో వేసి పాలు దగ్గరయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఈవిధంగా పాలల్లో ఉడికించడం వలన గురివింద గింజలలో ఉన్న ఔషధ గుణాలు బయటకు వస్తాయి. 100 గ్రాములు కొబ్బరి నూనెలో ఒక స్పూన్ బృంగరాజ్ పౌడర్ వేసి ఒక నిమిషం వేగించాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గురువింద గింజ పప్పు కూడా వేయాలి.పొయ్యి మీద నూనె మరిగే వరకు ఉంచాలి.

ఈ నూనె చల్లారాక వడకట్టి నిలువ చేసుకోవాలి. ఈ నూనెను తలకు రాసి అలా ఉంచుకోవచ్చు లేదా మరుసటి రోజు ఉదయం తల స్నానం చేయవచ్చు ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా తొలగిపోయింది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.