Kitchenvantalu

Rava Pulihora:ర‌వ్వ పులిహోర‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. టేస్ట్ భ‌లేగా ఉంటుంది..

Rava Pulihora Recipe: పులిహోర అనగానే వండిన అన్నంలో నిమ్మకాయ, లేదంటే చింతపండుతో చేసే పులిహోరానే చేస్తుంటారు. అలా కాకుండా రవ్వతో పులిహోర ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం రవ్వ- 1 కప్పు
నీళ్లు – 2 కప్పులు
ఉప్పు – ¼ టీ స్పూన్
నూనె – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు

తాలింపు కోసం..
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
శెనగ పప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
జీడిపప్పులు – కొన్ని
మిరియాలు – ½ టీ స్పూన్
చల్ల మిరిపకాయలు – 3
పచ్చిమిర్చి – 2
అల్లం తరుగు – 1 టీ స్పూన్
ఇంగువ – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1. స్టవ్ పై బాండీ పెట్టుకుని, నీళ్లు, ఉప్పు వేసి, మరగనివ్వాలి.
2. మరుగుతున్న ఎసరులో బియ్యం రవ్వ పోస్తూ, ఉండలు లేకుండా కలుపుకోవాలి.
3. కలుపుకున్న రవ్వను అన్నం వండుకున్నట్లుగా మూత పెట్టి, మీడియం ఫ్లేమ్ పై, మెత్తగా ఉడకనివ్వాలి.
4. ఉడికిన అన్నంలో పసుపు, కరివేపాకు, వేసి కలుపుకుని, పూర్తిగా చల్లారనివ్వాలి.

5. ఇప్పుడు తాళింపు కోసం, నూనె వేడి చేసి, అందులోకి తాళింపు కోసం తీసుకున్న పదార్థాలను వేసి, బాగా వేపుకోవాలి.
6. వేగిన తాళింపును చల్లారిన రవ్వన్నం లో వేసుకుని, పైన అల్లం తరుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర,నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని, 30 నిముషాలు పక్కన పెడితే, కలర్ ఫుల్ అండ్ టేస్టీ రవ్వ పులిహోర రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News