MoviesTollywood news in telugu

Tollywood:ఈ విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ అని మీకు తెలుసా…?

Bobby Simha Wife Details :మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించిన ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. అయితే అనుకోకుండా అతడి తల్లిదండ్రులు తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్ పరిసర ప్రాంతానికి వలస వెళ్లడంతో తమిళంలోనే నటుడిగా గుర్తింపు పొందాడు.

రేష్మి మీనన్ అనే హీరోయిన్ ని బాబీ సింహ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా చేసిన హైదరాబాద్ లవ్ స్టోరీ అనే చిత్రంలో,అలాగే తెలుగు హీరో సాయి రామ్ శంకర్ నటించిన నేనోరకం అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ రెండు మూవీస్ డిజాస్టర్ కావడంతో రేష్మి గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా తెలియకుండా పోయింది. కాగా రేష్మి మీనన్ తో కలిసి ఓ సినిమాలో పని చేస్తున్నప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డానని ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో బాబీ సింహ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత రేష్మి మీనన్ కుటుంబ సభ్యులకు కూడా తాను బాగా నచ్చడంతో రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని తెల్పాడు.అయితే తన భార్య తనను ఎంతగానో అర్థం చేసుకోవడంవల్ల తన సినీ కెరీర్ కుటుంబ వ్యవహారం బాగా నడుస్తోందని బాబీ సింహ చెప్పాడు.

ఇక తన కుటుంబ సభ్యులకు తన స్టార్ డమ్, షూటింగులు వివరాలు అలాగే చిత్ర వివరాలు పెద్దగా తెలియవని, తాను కూడా ఎప్పుడూ కూడా తన కుటుంబ సభ్యులతో వీటిని షేర్ చేసుకోనని తెలిపాడు. అయితే అప్పుడప్పుడు తన తల్లి మాత్రం ఫోన్ చేసి ఏదైనా సినిమాలో నటిస్తున్నావా? డబ్బులు కావాలా ? అని ఆరా తీస్తుందని తల్లి ప్రేమ గురించి వివరించాడు.