Face Glow Tips:ఇది రాస్తే 7 రోజుల్లో ఎంత నల్లగా ఉన్న వారైనా తెల్లగా కాంతివంతంగా మారిపోతారు
Tomato and honey Face Glow Tips In Telugu : మారిన జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది ముఖం మిద జిడ్డు, మొటిమలు, నల్లని మచ్చలు వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖం మీద చర్మం ఒక్కో సారి జీవం కోల్పోయి రంగు మారినట్లు కనిపిస్తుంది. ఈ సమస్యలు కనపడగానే చాలా కంగారు పడతారు.
అసలు కంగారు పడకుండా మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో అందమైన చర్మాన్ని పొందవచ్చు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీని కోసం ఒక బౌల్లో అర చెక్క టమాటారసం ఒక స్పూన్ తేనె ,పావు స్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు, నల్లటి మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా అందంగా మెరుస్తుంది. ఈ చిట్కా కి ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో తేనె పనిచేస్తుంది. పలు చర్మ సమస్యలను కూడా తేనె తగ్గిస్తుంది.
తేనెను ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ముఖంపై మొటిమలను పోగొట్టడానికి సహాయపడుతుంది.ముఖంలోని జిడ్డును తొలిగిస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ వేసుకొని తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.