Kitchenvantalu

Palak Corn Capsicum Rice:కేవలం 10 నిమిషాల్లో ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే పాలక్ కార్న్ కాప్సికం రైస్ చేసేయవచ్చు

Palak Corn Capsicum Rice Recipe: పాలకూర,కార్న్,క్యాప్సికం విడి విడిగా అన్ని మంచి పోషాకాలున్న వంటకాలే. మరి ఇవన్ని కలిపి స్పెషల్ రైస్ చేస్తే టేస్ట్ అదిరి పోతుంది.మీరు ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి- 2
ఉల్లిపాయ – 1
స్వీట్ కార్న్ – ¼ కప్పు
పాలకూర తరుగు – 1.5 కప్పు
సాంబార్ పొడి – 1 టీ స్పూన్
అన్నం – 1 కప్పు
మిరియాల పొడి- ½ టీ స్పూన్
నిమ్మరసం – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
2.అందులోకి అల్లం,పచ్చిమిర్చి తరుగువేసి 2 నిమిషాలు వేపుకోవాలి.
3.వేగిన పచ్చిమిర్చిలో ఉల్లిపాయ సన్నని తరుగు స్వీట్ కార్న్ ,ఉప్పు,పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తపడేవరకు వేపుకోవాలి.

4.వేగిన ఉల్లిపాయలోకి పాలకూర తరుగు వేసి పసరు వాసన పోయే వరకు వేపుకోవాలి.
5.తరువాత అందులోకి సాంబార్ పొడి వేసి ముప్పై నిమిషాలు వేపుకోవాలి.
6. ఇప్పుడు అందులోకి వండిన అన్నాన్ని ,మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ పై అన్నం వేడెక్కె వరకు కలుపుకోని చివరగా నిమ్మరసం వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పాలకూర ,కార్న్ ,క్యాప్సికం అన్నం రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News