Beauty TipsHealth

Cracked Heels:ఈ చిట్కా పాటిస్తే చాలు పాదాల పగుళ్ళు 3 రోజుల్లో మాయం అవుతాయి…ఇది నిజం

cracked Heels Remedies In telugu: ఈ చలికాలంలో పాదాల పగుళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. పాదాల పగుళ్ళ సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. పాదాలు పగుళ్లు ఉన్నప్పుడు దుమ్ము,ధూళి చేరి సమస్య మరింతగా పెరిగి నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

పాదాల పగుళ్లను తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ నెయ్యి, రెండు కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పాదాలు పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు క్రమంగా తగ్గిపోతాయి.

పాదాలలో కోల్పోయిన తేమ వచ్చేలా చేసి పాదాలు పొడిగా లేకుండా చేస్తుంది. పాదాలు పొడిగా మారితే కూడా పాదాల పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాదాలు తేమగా ఉండేలా చూసుకోవాలి. కర్పూరంలో ఉన్న లక్షణాలు ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ఈ రెండు ఇంగ్రిడియన్స్ మనకు చాలా సులభంగా ఇంటిలో లభ్యం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News