Megastar Chiranjeevi:చిరు పేరు వెనుక రహస్యం…గుడిలో జరిగిన అద్భుతం ఏంటి?
Megastar Chiranjeevi: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా మొగల్తూరు కి చెందిన శివ శంకర వరప్రసాద్ అంటే చాలామందికి తెలియదు. అదే మెగాస్టార్ చిరంజీవి అనగానే ఇట్టే తెలిసిపోతుంది. చదువు పూర్తయ్యాక సినిమాల్లో ఛాన్స్ లకోసం మద్రాసు వెళ్లి ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరిన ఈయన పునాది రాళ్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
సుధాకర్ చేయాల్సిన పునాది రాళ్లు సినిమా కొన్ని కారణాల వలన చిరుకి వచ్చేసింది. ఈ సినిమాలో చిరంజీవిగా పేరు పడింది. ఆతర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. అయితే శివ శంకర వరప్రసాద్ పేరు మార్పు వెనుక పెద్ద అద్భుతం జరిగిందట.
చిరంజీవికి కలలో రాముల వారి గుడికి వెళ్లినట్టు అక్కడ దణ్ణం పెట్టుకుంటుంటే , రా చిరంజీవి వెడదాం అనే మాట వినిపించిందట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఇంటికి వెళ్లి తన తల్లికి విషయం చెప్పడంతో చిరంజీవి అనే పేరు పెట్టుకోమన్నారట.
ఆంజనేయ స్వామికి మరో పేరు చిరంజీవి అని కూడా ఉందని,అందుకే సినిమాల కోసం ఈ పేరు పెట్టుకోవాలని ఆమె చెప్పడంతో ఆవిధంగా చిరంజీవి అయ్యాడు. ఈవిషయాన్ని చిరంజీవి చాలాసార్లు చెప్పుకొచ్చారు.
Click Here To Follow Chaipakodi On Google News