Gongura Nuvvula Pachadi:ఆంధ్ర స్టైల్ లో రుచికరమైన గోంగూర నువ్వుల పచ్చడి ఒక్కసారి ఇలా చేసి తినండి
Gongura Nuvvula Pachadi Recipe:గోంగూర నువ్వుల పచ్చడిని ఒకసారి తింటే మరల మరల తినాలని అనిపిస్తుంది. ఈ పచ్చడిని ఒకసారి చేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడికి కావలసిన పదార్ధాలు, తయారి విధానం తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
2 కట్టల గోంగూర ఆకులు
1/4 కప్పు నువ్వులు
15 పచ్చి మిరపకాయలు (అవసరం మేరకు)
1 స్పూన్ నూనె
వెల్లుల్లి (అవసరం మేరకు)
ఉప్పు (అవసరం మేరకు)
2 టేబుల్ స్పూన్లు నూనె
1 స్పూన్ మినపప్పు
1 స్పూన్ శనగపప్పు
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 tsp జీలకర్ర గింజలు
2 ఎర్ర మిరపకాయలు
2 రెమ్మలు కరివేపాకు
1/2 టీస్పూన్ పసుపు పొడి
తయారి విధానం
గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నువ్వులను వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఒక స్పూను నూనె వేసి పచ్చిమిరపకాయలను వేగించి పక్కన పెట్టుకోవాలి.అదే పాన్ లో మరో స్పూను నూనె వేసి గోంగూర ఆకులను, వెల్లుల్లి వేసి ఉడికించాలి.
ఉడికిన గోంగూర ఆకులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేయాలి.
ఆ తర్వాత వేగించిన నువ్వులు,వేగించిన పచ్చిమిర్చి, ఉడికించిన గోంగూర ఆకులు,వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ గా చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. చివరగా తాలింపు పెట్టాలి. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, ఎండుమిరప, శనగపప్పు, మినపప్పు,ఆవాలు మరియు జీలకర్ర, కరివేపాకు,పసుపు వేసి వేగించి
చట్నీలో కలపాలి.