Guess The Actress: తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.. కానీ!
Tollywood Heroine Preeti Jhangiani details:మెగాస్టార్ సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో బ్రేక్ ఇచ్చిన సినిమా తమ్ముడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయ్,సుస్వాగతం వంటి సినిమాల తర్వాత మెగాస్టార్ సోదరుడి రేంజ్ కి తగ్గట్టు వచ్చిన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ మూవీలో పవన్ సరసన మెరిసిన హీరోయిన్ ప్రీతి జింగానీయా మోడలింగ్ రంగం నుంచి వచ్చింది. 1980 ఆగస్టు 18న జన్మించిన ఈ ముద్దుగుమ్మ స్టడీస్ పూర్తయ్యాక మోడలింగ్ చేస్తూ సినిమాల్లో రావడానికి శిక్షణ కూడా తీసుకుంది.
తెలుగులో తమ్ముడు మూవీ తర్వాత బాలయ్య తో చేసిన నరసింహనాయుడు కూడా ప్రీతికి మంచి పేరు తెచ్చింది. నిజానికి మలయాళంలో మజావిల్లు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆతర్వాత తెలుగు,తమిళంలలో కూడా ఎంట్రీ ఇచ్చి విజయాలను నమోదుచేసుకుంది. 2012లో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీని పెళ్లాడిన ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు.
పెళ్లితర్వాత అడపా దడపా నటించినప్పటికీ 2017తర్వాత నుంచి అసలు సినీ రంగంవైపు చూడలేదు. ఈమె భర్త సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో చిన్న బడ్జెట్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జింగానీయా ముంబయిలో భర్త,కొడుకుతో కల్సి నివాసం ఉంటోంది.