Kerala Egg Curry :సులభమైన కేరళ స్టైల్ ఎగ్ కర్రీ తప్పక రుచి చూడాల్సిందే..
Kerala Egg Curry Recipe : రోటీ,అన్నం లోకి సూపర్ కాంబినేషన్ కొబ్బరి పాల ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
గుడ్లు – 3
కొబ్బరి పాలు – ½ కప్పు
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
టమాటోలు – 2
పపుసు – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కారం – 1 టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
చింతపండు – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా గుడ్లను ఉడికించి రెండు బాగాలుగా కట్ చేసుకోవాలి.
2.పచ్చికొబ్బరి ని మిక్సి జార్ లోవేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసి గ్రైండ్ చేసి కొబ్బరి పాలను వడగట్టుకోవాలి.
3.ఇప్పుడు కూర కోసం ప్యాన్ లో ఆయిల్ వేసుకోని వేడెక్కాక ఆవాలు ,ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
4.వేగిన ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి వేసి ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి.
5.అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.
6.మగ్గిన టమాటోలకి ఉప్పు,కారం,పసుపు మిరియాల పొడి,ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
7.మసాలాలు వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసి చిక్కపడే వరకు ఉడికించాలి.
8.చింతపండు ఉడికిన తర్వాత కొబ్బరిపాఉ యాడ్ చేసి మరికాసేపు మరగనివ్వాలి.
9.ఇప్పుడు అందులోకి కరివేపాకు,ఉడికించిన గుడ్లు వేసి ఐదునిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10.అంతే ఎంతో రుచికరమైనా కొబ్బరి పాల ఎగ్ కర్రీ రెడీ.