Kitchenvantalu

Mirapakaya bajji:మిరపకాయ బజ్జీ Perfect గా బండి మీద టేస్ట్ రావాలంటే పిండి ఇలా కలిపి వేయండి

Mirchi Bajji Recipe: వానాకాలం వచ్చిందంటే చాలు.మిరపకాయ బజ్జీల పై మనుసు లాగుతుంది. ఇంట్లోనే బండిమీద బజ్జీలాంటీ టేస్ట్ వచ్చేలా ఇలా తయారు చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
మిరపకాయలు పెద్దవి -1/4 kg
ఉప్పు – రుచికి సరిపడా
శగనపిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
బేకింగ్ సోడా – ½ టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – ½ టేబుల్ స్పూన్
వాము పొడి – ½ టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం
1.1/4 మిరపకాయలను కడిగి పొడవుగా చీరుకోని మద్యలో ఉన్న విత్తనాలను తీసివేయాలి.
2.ఒక మిక్సింగ్ బౌల్ లో ఉప్పు కొద్దిగా నీళ్లు వేసి మిరపకాయలను 5 నిమిషాలు నానబెట్టాలి.
3.ఇప్పుడు శగనపిండిని గిన్నెలో వేసి అందులోకి బియ్యం పిండి ఉప్పు,జీలకర్ర పొడి వాముల పొడిని కలుపుకోని పిండిని మిక్స్ చేయాలి.
4.కొద్ది కొద్దిగా నీరా కలుపుతూ పిండిని కలుపుకోవాలి.నీరా జీర్ణక్రియకి,మరియు రోగనిరోదక శక్తిని పెంచుతుంది.

5.నీరా అందుబాటులో లేకపోతే నీళ్లతో పిండిని కలుపుకోవచ్చు.
6.పిండిలో ముద్దలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి.
7.ఇప్పుడు మిరపకాయలను పిండిలో ముంచి కోటింగ్ చేసిన తర్వాత వేడి నూనెలో వేసుకోవాలి.
8. ఇప్పుడు బజ్జీలను మంచి రంగు వచ్చేవరకు కాల్చుకోని జల్లిగరిట సాయంతో బయటికి తీసుకోని వేడివేడి మిర్చిబజ్జీలు సర్వ్ చేసుకోవడమే.