Mosquito:5 నిమిషాల్లో దోమలు మీఇంట్లో నుండి పారిపోవాలంటే…
mosquito remove home remedy in telugu : ఈ కాలంలో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దోమలను వదిలించుకోవటానికి మస్కిటో కాయిల్స్, స్ప్రేల బదులుగా సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించాలి. మస్కిటో కాయిల్స్ వంటివి వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే సహజసిద్ధమైన పద్దతుల ద్వారా దోమలను తరిమికొడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. సీజన్ ఏదైనా దోమలు మాత్రం తప్పటం లేదు. ఇప్పుడు చెప్పే రెమిడీ చాలా సమర్ధవంతంగా దోమలను తరిమికొడుతుంది. ఈ రెమిడీకి కావలసిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే.
ఒక మట్టి ముకుడులో రెండు బిరియాని ఆకులను ముక్కలుగా కట్ చేసి వేయాలి. దానిలో 4 లవంగాలు, 4 కర్పూరం బిళ్ళలు, ఒక పుదీనా టాబ్లెట్ లోని ఆయిల్ ని వేసి మంట వెలిగించాలి. ఈ పొగకు దోమలు పారిపోతాయి.
పుదీనా టాబ్లెట్ దోమలను తరిమికొట్టటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే లవంగాలు, కర్పూరం కూడా దోమలను తరిమికొట్టటానికి సహాయపడుతుంది. దోమలు ఉన్న ప్రదేశంలో ఈ పొగను వేస్తే దోమలు చనిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.