Ragi Dosa: ఇలా రాగి దోశ చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు, అధిక బరువు నుంచి ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు
Ragi dosa:బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలన్నది ప్రతి రోజూ మహిళల ముందున్న పెద్ద ప్రశ్న. ఆరోగ్యంతో పాటూ రుచిగా ఉండాలంటే ఒకసారి రాగి దోశెను చేసుకుని తింటే సరిపోతుంది. రాగి దోశ ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు
1 కప్పు రాగులు
½ కప్పు బియ్యం
¼ కప్పు మినప పప్పు
నూనె తగినంత
ఉప్పు రుచికి సరిపడా
వంట సోడా చిటికెడు
తయారి విధానం
ముందుగా రాగులను, బియ్యాన్ని, మినపపప్పును నీటితో బాగా కడిగి మరలా నీళ్ళు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిండి చిక్కటి మజ్జికలా ఉండాలని గుర్తుపెట్టుకొండి. అప్పుడే దోస మంచి మందంగా వస్తుంది.
పిండిని గిన్నెలోకి తీసుకోని రుచికి సరిపడ ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసి మొత్తం పిండిని ఒక 10 నిమిషాల పాటు పిండి పైకి పొంగేలా గిల కొట్టుకోవాలి. ఇలా గిల కొట్టడం వల్ల పిండి లోకి గాలి చేరి దోసలు వేసినప్పుడు పొంగుతూ చాలా బాగా రుచిగా వస్తాయి.
ఇక పొయ్యి మీద పెనం పెట్టి ఏ పిండితో dosaలు వేస్తే చాలా బాగా వస్తాయి.