Raw Garlic:వెల్లుల్లిని పచ్చిగా తింటే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
Raw garlic Health benefits : వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనలో చాలా మంది తింటూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి పచ్చి వెల్లుల్లిని తినవచ్చా అనే సందేహం ఉంటుంది.పచ్చి వెల్లుల్లిని కొన్ని సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదు. పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవటం వలన ఆ ప్రభావం లివర్ పనితీరుపై పడుతుంది.
ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తీసుకోవటం వలన కొంత మందికి గ్యాస్ ఉత్పత్తి అయ్యి మోషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెల్లుల్లి అనేది బ్లీడింగ్ రిస్క్ ను పెంచుతుంది. కాబట్టి సర్జరీ తరువాత వెల్లుల్లిని కనీసం రెండు వారాల వరకు తీసుకోకుండా ఉంటేనే మంచిది. పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వలన స్కిన్ ఇరిటేషన్ కి గురికావచ్చు.
వెల్లుల్లిలో ఉండే అల్లీయిన్ ల్యాస్ అనే ఎంజైమ్ స్కిన్ ని ఇరిటేషన్ కి గురిచేస్తుందని గుర్తుంచుకోవాలి. పచ్చివెల్లులిని తీసుకోవడం వలన మైగ్రైన్ తలనొప్పి పెరిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా వెల్లుల్లిని తీసుకోవడం వలన గర్భిణీలలో ముందస్తు ప్రసవం అయ్యే సూచనలు కనిపిస్తాయి. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకపోవటం మంచిది.
పచ్చి వెల్లుల్లి తీసుకొనే ముందు ఒక్కసారి ఆలోచించాలి. వెల్లుల్లి తీసుకోవాలని అనుకున్నప్పుడు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. అలాగే వెల్లుల్లి ముక్కలను తేనెలో నానబెట్టి తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.