Face Glow Tips:కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లటి ముఖం అయినా తెల్లగా మారటం ఖాయం
Coffee Face Glow Tips In telugu : మనలో చాలా మంది ముఖం అందంగా,కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్దీ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా అది తాత్కాలికమే. ఆలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.
అంతే కాకుండా ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది. సాదరణంగా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలని అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలు ఖర్చు పెట్టి రకరకాల ఫిషియల్స్ చేయించుకుంటాం. ఆలా చేయించుకుంటే ముఖం అందంగా మెరిసిపోతూ ఉంటుందని భావిస్తాం. అయితే ఎటువంటి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా,ప్రకాశవంతంగా మారుతుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ఎంత నల్లగా ఉన్న ముఖం అయినా తెల్లగా,కాంతివంతంగా మెరిసిపోతుంది.
కాఫీ పౌడర్ అద్భుతమై నేచురల్ స్కిన్ ఎక్సఫ్లోయేటింగ్ ఏజెంట్. చర్మం మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది, దాంతో చర్మంలో డల్ మరియు డ్రై ప్యాచ్ లను తొలగిస్తుంది.చర్మానికి సహజతత్వాన్ని అందివ్వడంలో మరియు ముఖంలో మొటిమలు, మచ్చలు, ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. తేనె సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.