Used Tea Powder : వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలిస్తే ఇకపై అలా చేయరు..!
Used Tea Powder benefits : మనం సాదారణంగా రోజులో రెండు సార్లు టీ తాగుతూ ఉంటాం. అలా టీ తాగినప్పుడు టీ వడకట్టి టీ పొడిని పాడేస్తూ ఉంటాం. అలా పాడేసే టీ పొడిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పొడిని మొక్కలకు ఎరువుగా వేయవచ్చు.అలాగే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.
మనం పూరి లేదా చపాతీలోకి ఛోలే మసాలా చేసుకుంటూ ఉంటాం. వాడేసిన టీ పొడిని శుభ్రంగా కడిగి మరల ఆ పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి ఛోలే మసాలాలో కలిపితే కూరకు మంచి వాసన, రంగు వస్తుంది. అలాగే ఈ నీటితో ఫర్నీచర్ ని శుభ్రం చేస్తే కొత్తవాటి వలే మెరుస్తాయి. ఈ నీటిని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే జుట్టు మేరవటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
ఈ నీటిలో మంచి సువాసన కోసం ముఖ్యమైన నూనెలు కొన్ని చుక్కలు వేసి రూమ్ ఫ్రెషనర్ గా వాడవచ్చు. కూరగాయల కట్టింగ్ బోర్డుపై నల్ల మచ్చలు ఉంటే తొలిగించుకోవచ్చు. చాపింగ్ బోర్డ్ నుండి మరకలను తొలగించడానికి ఈ నీటిలో నిమ్మరసం, డిష్ వాషింగ్ లిక్విడ్ సోప్ కలపాలి. ఈ మిశ్రమంతో చాపింగ్ బోర్డ్‌ను శుభ్రం చేస్తే మరకలు అన్ని తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News