Face Glow Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం
Banana and lemon Face Glow Tips : ముఖం మీద ముడతలు,మచ్చలు లేకుండా తెల్లగా,కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో చాలా సులభంగా ముడతలు,మచ్చలను తొలగించుకొని యంగ్ లుక్ లో కనిపించవచ్చు. ఒక బౌల్ లో బాగా పండిన అరటిపండులో సగాన్ని వేసి మెత్తగా చేయాలి.
దీనిలో ఒక స్పూన్ ఒట్స్ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా 5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలు,మచ్చలు అన్ని తొలగిపోయి ముఖ చర్మం యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది. కాస్త సమయాన్ని, శ్రద్దని పెడితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. నిమ్మలో ఉన్న లక్షణాలు చర్మం మీద మృత కణాలను తొలగిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.