Cloves White Hair Tips:ఇలా చేస్తే 10 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…జీవితంలో తెల్లజుట్టు ఉండదు
Cloves White Hair Tips : తెల్లజుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. అలా రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా కాకుండా తెల్లజుట్టు ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే ప్యాక్ ఉపయోగిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. దీని కోసం ముందుగా డికాషన్ తయారుచేసుకోవాలి.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ మెంతి పిండి,ఒక స్పూన్ లవంగాల పొడి, ఒక స్పూన్ టీ పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ డికాషన్ వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఒక బౌల్ లో 5 స్పూన్ల హెన్నా పొడి,ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. దీనిలో తయారు చేసి పెట్టుకున్న డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే కాస్త సమయం ఎక్కువ పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఆమంచి పలితాన్ని పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.